హైదరాబాద్‌లో ఎబోలా కలకలం: గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు అనుమానితులు
- ఒకే అంతర్జాతీయ విమానంలో ప్రయాణించిన ముగ్గురిలో లక్షణాలు
- సూడాన్ నుంచి వచ్చిన ప్రయాణికుడికి ఎయిర్‌పోర్ట్‌లోనే గుర్తింపు
- నిర్ధారణ కోసం నమూనాలను పూణె వైరాలజీ ల్యాబ్‌కు పంపిన అధికారులు
- ఆందోళన వద్దని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ వెల్లడి
భాగ్యనగరంలో ఎబోలా వైరస్ కలకలం రేపుతోంది. ఎబోలా తరహా లక్షణాలతో ముగ్గురు వ్యక్తులు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామంతో అప్రమత్తమైన తెలంగాణ ఆరోగ్య శాఖాధికారులు, బాధితులను ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించి వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉంచారు.
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం ఎబోలా ప్రాథమిక లక్షణాలతో ఇద్దరు వ్యక్తులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిని ఆశ్రయించారు. పరిస్థితిని గమనించిన వైద్యులు వారిని తక్షణమే గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో గాంధీలో చేరిన ఎబోలా అనుమానితుల సంఖ్య మూడుకు చేరుకుంది. ప్రాథమిక దర్యాప్తులో ఈ ముగ్గురు ఒకే అంతర్జాతీయ విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నట్లు వెల్లడి కావడంతో, సదరు విమానంలో ప్రయాణించిన ఇతర ప్రయాణికుల వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
కాగా, అంతకుముందు గురువారం నాడు సూడాన్ నుంచి ఇథియోపియా మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న 30 ఏళ్ల వ్యక్తిని విమానాశ్రయ వైద్య బృందం గుర్తించింది. థర్మల్ స్క్రీనింగ్‌లో అతనికి 100 డిగ్రీల జ్వరం ఉన్నట్లు తేలింది. ఇటీవల ఎబోలా ప్రభావిత దేశాలైన ఉగాండా, దక్షిణ సూడాన్‌లలో అతడు పర్యటించినట్లు సమాచారం అందడంతో, అధికారులు ముందుజాగ్రత్తగా అతడిని గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
ప్రస్తుతం ఆ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎబోలా తీవ్రతను సూచించే రక్తస్రావం, వాంతులు వంటి లక్షణాలు ప్రస్తుతానికి ఎవరిలోనూ కనిపించడం లేదని వైద్యులు స్పష్టం చేశారు. బాధితుల నుంచి సేకరించిన నమూనాలను తుది నిర్ధారణ పరీక్షల నిమిత్తం పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి పంపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖాధికారులు భరోసా ఇచ్చారు. పూణె నుంచి వచ్చే నివేదికల ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని వారు వెల్లడించారు.